‘ఖైదీ’ టీజర్ టాక్

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ’ తెలుగు తెరపై ట్రెండ్ సెట్టరు. ఇప్పుడిదే టైటిల్ తో తమిళ్ స్టార్ కార్తీ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి లోకేష్‌ కనకరాజ్‌ దర్శకుడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

శుక్రవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో కార్తీ డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించారు. ఓ రాత్రి ఏం జరిగిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తీశారు. టీజర్‌ మొత్తం రాత్రి సన్నివేశాలతోనే సాగింది. ‘ఇతడి తల తెచ్చి ఇచ్చిన వాడికి.. జీవితాంతం బతికేందుకు కావాల్సినంత డబ్బు ఇస్తా’ అని విలన్‌ వందల మంది రౌడీలతో చెప్పడం టీజర్ లో ఆసక్తికరంగా అనిపించింది.