అఫీషియల్ : మహేష్..’సరిలేరు నీకెవ్వరు’

సూపర్ స్టార్ మహేష్26 టైటిల్ ఖరారైంది. గ్రేట్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్26 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం సరిలేరు నీకెవ్వరు, వాట్సాప్, రెడ్డిగారి అబ్బాయి టైటిల్స్ వినిపించాయి. ఫైనల్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ ని ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఇవాళ (మే31) సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా టైటిల్ పోస్టర్ ని కూడా వదిలారు. పోస్టర్ లో తుపాకి, దానిపైనా జవాను టోపీ ఉంది. దీంతో సినిమాలో మహేష్ జవాన్ గా కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది.

ఈ చిత్రం కోసం హీరోయిన్ గా రష్మిక మందనని ఎంపిక చేశారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. మరో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. బలమైన కథ, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టచ్ తో సరిలేరు నీకెవ్వరు తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి దిల్ రాజు సంగీతం అందిస్తున్నారు. మహర్షి మాదిరిగా ఈ చిత్రానికి ముగ్గురు నిర్మాతలుగా వ్యవహించనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు లతో పాటు మహేష్ నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నారు. వచ్చే యేడాది సంక్రాంత్రి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయనున్నారు.