అమెరికాలో మళ్లీ కాల్పులు.. 12మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. వర్జీనియా బీచ్‌ నగరంలో ప్రభుత్వ భవన సముదాయం వద్ద ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 12 మంది మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఓ పోలీసు అధికారి కూడా గాయపడ్డాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది రంగంలోకి దుండగుడిని మట్టుబెట్టారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. అదే ప్రభుత్వ భవనంలో అతడు పనిచేస్తున్నాడు. అతడొక్కడే ఈ కాల్పులకు తెగబడినట్లు తెలిపారు. కాల్పులకు తెగబడ్డానికి గల కారణాలు ఇంకా మాత్రం తెలియరాలేదు.