మహేష్ కొత్త లుక్.. ఇలా ఉండబోతుంది !


సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్ లోకి మారబోతున్నాడు. ‘మహర్షి’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ పాత్ర కోసం మహేష్ గడ్డెం పెంచారు. అచ్చం కాలేజీ కుర్రాడిగా కనిపించారు. మహర్షి సెలబ్రేషన్స్ లోనూ మహేష్ జీన్స్, టీషర్ట్స్ తో స్కూళ్లు, కాలేజీల సందర్శణ చేశారు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం మహేష్ ఆర్మీ ఆఫీసర్ లుక్ లోకి మారబోతున్నాడు.

మిలిటరీ ఆర్మీ ఆఫీసర్ అంటే.. ఆర్మీ కటింగ్.. హైట్ కు తగ్గ వెయిట్. కొనదేలిన మీసం లుక్ లోకి మహేష్ మారాల్సి ఉంటుంది. మరీ.. మహేష్ కోరమీసం పెంచుతాడా.. ? లేదంటే క్లీన్ షేవ్ లోనే కనిపిస్తారా ?? అన్నది చూడాలి. ఇక, ఈ చిత్రంలో మహెష్ కి జంటగా రష్మిక మందన జతకట్టనున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర్, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.