పవన్ ని వదల : బండ్ల

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బండ్ల గణేష్ పవన్ ని ఒప్పించే పనిలో ఉన్నాడని చెప్పుకొంటున్నారు. ఐతే, బండ్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా బండ్లనే తెలిపారు. ఇటీవ‌ల ప‌వ‌న్‌ను క‌లిసి సినిమా చేయ‌మ‌ని అడిగా. ఇక సినిమాలు చేసే ఉద్దేశ‌మే లేద‌ని ఆయన చెప్పారు.
అయినా తాను ప‌వ‌న్‌ ని వ‌ద‌ల‌. ఆయనతో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని బండ్ల తెలిపారు.

నిజంగానే మళ్లీ సినిమాలు చేసే ఉద్దేశం పవన్ కు లేదని తెలుస్తోంది. ఇటీవల మెగా కుటుంబ సభ్యులు పవన్ ని కలిశారు. వారితోనూ తాను మళ్లీ సినిమాలు చేయను. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోనే ఉంటా. ప్రజా సమస్యలపై పోరాడుతా. మరో 25యేళ్లు ప్రజా జీవితంలోనే ఉంటానని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం పవన్ అభిమానులని తీవ్రంగా నిరాశపరిచేదేనని చెప్పవచ్చు.