‘రాక్షసుడు’ టీజర్ టాక్

రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్-రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘రాక్షసుడు’. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మాత. జులై 18న రాక్షసుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో స్కూల్ విద్యార్థిని ఎవరో అతి కిరాతకంగా చంపినట్టు చూపించారు. ‘ఆ హత్య చేసినవాడు ఓ సైకో. వాడికి నొప్పంటే ఏంటో తెలియదనుకొంటా. వాడొక రాక్షసుడు’ అనే మాటలు చెప్పించారు. ఈ హత్య వెనక పోలీస్ ఆఫీసర్ బెల్లకొండ శ్రీనివాస్ ఉన్నట్టు… ఆయన ‘ఆంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్’ తో బాథపడుతున్నట్టు టీజర్ లో చూపించారు. ఓ విచిత్రమైన బొమ్మ కూడా కనిపించించి. మొత్తంగా.. రాక్షసుడు టీజర్ సస్పెన్స్ క్రియేట్ చేసింది. సినిమా కథపై ఆసక్తిని పెంచేలా ఉంది.