రెండో మన్మథుడు సంతృప్తిపరిచాడు !


రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రెండో మన్మథుడు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే ‘మన్మథుడు2’ 90శాతం షూటింగ్ పూర్తి చేసుకొన్నాడు. సినిమా అధికభాగం పోర్చుగల్ లోనే చిత్రీకరించారు. ఈ సినిమా అవుట్ పుట్ పై చిత్రబృందం సంతృప్తిగా ఉందని తెలిసింది. సినిమా చాలా బాగా వస్తుందని చెబుతున్నారు.

విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘మన్మథుడు’ సూపర్ హిట్ అయింది. నాగార్జున కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథని అందించారు. ఆయన మాటలు, పంచ్ డైలాగులు బాగా పేలాయ్. ట్రెండ్ ని సెట్ చేశారు. ఆ సినిమాకి సీక్వెల్ గా భావిస్తున్న మన్మథుడు2లోనూ వినోదానికి కొదవ ఉండదని సమాచాఅరమ్. కాకపోతే.. మన్మథుడు చిత్రానికి మన్మథుడు2 రివర్స్ లో ఉంటుందట. అదెలా.. అనేది తెరపై చూడాల్సిందే.