హిప్పీకి అందుకే ‘ఎ’ ఇచ్చారట.. !

‘ఆర్ఎక్స్100’ హీరో కార్తీకేయ నటించిన రెండో చిత్రం ‘హిప్పీ’. ఈ చిత్రానికి టి.ఎన్‌.కృష్ణ దర్శకుడు. కలైపులి ఎస్‌.థాను నిర్మాత. జూన్‌ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘హిప్పీ’ కూడా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాయే. అది ‘ఆర్ఎక్స్100’ మించేలా ఉండబోతుందని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. అందుకే ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ దక్కినట్టు తెలుస్తోంది.

దీనిపై నటుడు జేడీ చక్రవర్తి స్పందించారు. చాలా రోజుల విరామం తర్వాత తెలుగులో జేడీ నటించిన సినిమా ‘హిప్పీ’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా జేడీ చక్రవర్తి ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రేమ, ఆకర్షణకు మధ్య తేడా తెలిపే సినిమా ఇది. సెన్సార్‌ వాళ్లు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఇందులో చెప్పాలనుకున్న అంశాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా సూటిగా చెప్పారు. అందుకే ‘ఏ’ వచ్చింది’ అన్నారు జేడీ.