చల్లని కబురు వచ్చేసింది
ఎండలు మండిపోతున్నాయ్. ఏకంగా 47డిగ్రీలకుపైగా ఎండలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా మారుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది రుతుపవన వర్షాలు జూన్ 6న కేరళకు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ప్రస్తుతం రుతుపవనాలు అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతంలో, బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి, ఆగ్నేయ, తూర్పుమధ్య భాగాల్లో విస్తరించాయని, రాబోయే రెండుమూడు రోజుల్లో అరేబియా సముద్రంలో మరిన్ని ప్రాంతాల్లో విస్తరిస్తాయని ఐఎండీ ఉన్నతాధికారి ఎం.మొహాపాత్ర తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాది ప్రాంతాల్లో రాబోయే మూడు నుంచి ఐదు రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.