విత్ అవుట్ మేకప్ ఎఫెక్ట్ : ఆ సినిమా నుంచి కాజల్ ఔట్ ?

స్టార్ హీరోయిన్ కాజల్ తన నిజమైన అందాన్ని చూపించింది. మేకప్ లేని ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి వైరల్ అయ్యాయి. మేకప్ లేకుండా కాజల్ ని చూసి జనాలు దడుసుకొన్నారు. ఆమె అభిమానులు కూడా. అదే సమయంలో కాజల్ ధైర్ఘ్యాని మెచ్చుకొన్నారు. ఈ ఫోటోల ఎఫెక్ట్ అన్నట్టుగా కాజల్ ని బిగ్ ప్రాజెక్టు నుంచి తప్పించినట్టు సమాచారమ్.

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు2’ చిత్రం ప్రారంభం అయింది. కొద్దిరోజులు షూటింగ్ కూడా జరుపుకొంది. కొన్ని కారణాల వలన సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడీ ఈ సినిమా సమస్యలన్నీ తీరిపోయాయ్. త్వరలో తిరిగి షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఐతే, ఈ సినిమా నుంచి కాజల్ తప్పుకొన్నట్టు వార్తలొస్తున్నాయ్. ఆమె బిజీ అయిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అది నిజమా ? లేకపోతే కాజల్ విత్ మేకప్ ఫోటోల ఎఫెక్ట్ తో ఆమెని కావాలనే భారతీయుడు2 చిత్రం నుంచి తప్పించారా.. ?? అన్నది తెలియాల్సి ఉంది.