జయసుధపై జగన్ కు అంత నమ్మకం ఏంటో ?
వైసీపీలోనూ సినీ గ్లామర్ ఎక్కువైంది. ఎన్నికల ముందు ఆ పార్టీలోకి సినీ స్టార్స్ క్యూ కట్టారు. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీలోకి చేర్చుకొన్నారు జగన్. అలా వైకాపాలో చేరిన సినీ స్టార్స్ పంటపడింది. ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సినీ స్టార్స్ నామినేటెడ్ పోస్టులపై పెద్ద ఆశలే పెట్టుకొన్నట్టు కనబడుతోంది. సీఎం జగన్ మాత్రం మొదట సహజనటి జయసుధని కరుణించేలా కనబడుతున్నాడు. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్ డీసీ) చైర్మన్ పదవికి జయసుధని అనుకుంటున్నట్టు సమాచారమ్.
ఇన్నాళ్లు ఎఫ్ డీసీ చైర్మన్ గా అంబికా కృష్ణ వ్యవహరించారు. టీడీపీ ఓటమితో ఆయన ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించేందుకు వైకాపా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పోసాని కృష్ణ మురళీ, పృధ్వీరాజ్, అలీ, మోహన్‌బాబు, జయసుధ, జీవిత, రాజశేఖర్ తదితర పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో పోసాని, పృధ్వీ చానాళ్ల నుంచి వైకాపాలో ఉన్నారు. పార్టీ వాయిస్ ని వినిపించారు. మిగితావారు ఎన్నికల ముందు పార్టీలో చేరినవారే.
జగన్ మాత్రం ఎఫ్ డీసీ చైర్మన్ పదవిని సహజనటి జయసుధని ఇవ్వాలని అనుకొంటున్నారట. ఆమెకి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. పైగా క్లీన్ ఇమేజ్. అందుకే సీఎం జగన్ జయసుధపై నమ్మకం ఉంచారని చెబుతున్నారు. మరీ.. మిగితా సినీ స్టార్స్ పరిస్థితి ఏంటీ ? అంటే.. వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే.. కొద్దిగా ఓపిక పట్టాలని సీఎం జగన్ అంటున్నట్టు తెలుస్తోంది.