తమన్నా పెళ్లి ప్రకటన

మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి ప్రకటన ఇచ్చింది. తనకి పెళ్లి కొడుకుని వెతికి పెట్టమని మీడియాను కోరింది. ఇన్నాళ్లు పెళ్లెప్పుడు ? అని అడిగితే.. దానికి తొందరేముందు అనేది తమ్మూ. ఇప్పుడు మాత్రం చాలా స్పష్టంగా తాను పెళ్లి రెడీ అని చెప్పేసింది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నాపై విధంగా స్పందించింది.

“సరైన వ్యక్తి దొరికితే ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ వ్యక్తి దొరకాలి కదా..! నాకు మంచి అబ్బాయిని వెతికిపెట్టమని ‘అభినేత్రి 2’ దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌ను కూడా అడిగాను. మీరు (మీడియా వర్గాలు) కూడా నా కోసం అబ్బాయిని వెతికిపెడతారని ఆశిస్తున్నా”నంది మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం తమన్నా ‘దటీజ్ మహాలక్ష్మి’, ‘ఖామోషీ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.