ప్రపంచకప్’లో తొలి సంచలనం


ప్రపంచకప్ చాలా చప్పగా మొదలైంది. మొదటి నాలుగు మ్యాచ్ లు వన్ సైడ్ గా సాగాయి. ప్రేక్షకులకి అసలైన మజాని పంచలేదు. ఐతే, ఆదివారం దక్షిణాఫ్రికా-బంగ్లాదేష్ ల మధ్య జరిగిన మ్యాచ్ అసలు మజాని పంచింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లా 330 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. సౌమ్యసర్కార్‌(42; 30 బంతుల్లో 9×4), షకిబ్‌ అల్‌ హసన్‌(75; 84 బంతుల్లో 8×4, 1×6), ముష్ఫికర్‌ రహీమ్‌(78; 80 బంతుల్లో 8×4) మహ్మదుల్లా(46; 33 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్‌ తాహిర్‌, ఫెలుక్వాయో, క్రిస్‌ మోరిస్‌ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం బంగ్లాదేశ్‌ నిర్ధేశించిన 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 309 పరుగులకే పరిమితమైంది. దీంతో బంగ్లా జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మార్‌క్రమ్‌(45; 56 బంతుల్లో 4×4), డు ప్లెసిస్‌ (62; 53 బంతుల్లో 5×4, 1×6), డేవిడ్‌ మిల్లర్‌(38; 43 బంతుల్లో 2×4), వాన్‌ డర్‌ డుస్సెన్‌(41; 38 బంతుల్లో 2×4,1×6) రాణించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ మూడు, సైఫుద్దీన్‌ రెండు, మెహిది హసన్‌, షకిబ్‌ అల్‌ హసన్‌ చెరొక వికెట్‌ తీశారు.