‘మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్’ పొగొట్టుకున్న సచిన్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుని పోగొట్టుకొన్నారు. ప్రపంచకప్-2003లో జరిగిన ఈ సంఘటనని తాజా ప్రపంపంచకప్ సందర్భంగా సచిన్ గుర్తు చేసుకొన్నారు. 2003లో జరిగిన ప్రపంచకప్‌లో భాగంగా.. దాయాది పాకిస్థాన్ పై భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సచిన్ వీరోచితంగా పోరాడి 98 పరుగులు చేసి పాక్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. సంబరాల్లో పడి మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డుని సచిన్ పోగొట్టుకొన్నారు.
మ్యాచ్ ముగిసేసరికి బాగా పొద్దుపోయింది. రాత్రి11గంటల ప్రాంతంలో టీమిండి ఆటగాళ్లు డిన్నర్ కోసం బయటికి వెళ్లారు. అప్పటికే హోటల్, రెస్టారెంట్స్ ని మూసేశారు. ఫైనల్ గా చైనీస్ హోటల్ కనిపించింది. అక్కడికెళ్లి అందరూ డిన్నర్ చేశారు. ఆ సమయంలో తన చేతిలో ఉన్న పార్సిల్ ని సచిన్ స్నేహితుడికి ఇచ్చాడట. జాగ్రత్తగా పట్టుకోమని చెప్పడట. హోటల్ కి తిరిగొచ్చాక అడిగితే.. ఆ పార్సిల్ ని హోటల్ లోనే మరిచిపోయి వచ్చానని చెప్పాడట. కష్టపడి ఆ హోటల్ ఫోన్ నెంబర్ సంపాదించి.. ఫోన్ చేస్తే.. ఆ పార్సిల్ ని హోటల్ వాళ్లు తిరిగిచ్చారని చెప్పారు సచిన్.