ఏపీలోనూ హరీష్ రావు జన్మదిన వేడుకలు !

తెరాస ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. హారీష్ రావు అందుబాటులో లేకపోయిన ఆయన అభిమానులు ధూం ధామ్ గా సెలబ్రేట్ చేసుకొన్నారు. బ్యానర్లు, పోస్టర్లతో అభిమానాన్ని చాటుకొన్నారు. కొన్ని చోట్ల డబ్బు, దరువులతో అభిమానులు, తెరాస కార్యకర్తలు హరీష్ రావు బర్త్ డేను సెలబ్రేట్ చేసుకొన్నారు.

తెలంగాణలోనే కాదు ఏపీలోనూ హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. హరీష్ రావు ఏపి అభిమాన సంఘం తిరుపతిలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. 194 మంది అనాధ పిల్లలకు అన్నదానం చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక, రెండోసారి కేసీఆర్ ప్రభుత్వంలో హరీష్ రావుకి మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన అభిమానులు అసంతృప్తిలో ఉన్నారు. తెరాస వారసుడు కేటీఆర్ అనే చెప్పేందుకు హరీష్ రావుని పక్కన పెట్టారనే గుసగుసలు వినబడుతున్నాయ్.