ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ ఘోరంగా ప్రపంచకప్‌ని ఆరంభించింది. తొలి మ్యాచ్ లో వెస్టిండీస్‌పై చెత్త బ్యాటింగ్‌తో 105కే కుప్పకూలింది. ఈ లక్ష్యాన్నివిండీస్ 13ఓవర్లకే చేధించింది. దీంతో పాక్ కు ఘోర పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్ పాక్ కి పెద్ద గాయమే చేసింది. ఆ మ్యాచ్ ని మరచిపోలేకపోతున్నానని పాక్ కెప్టెన్ సర్పరాజ్ ఖాన్ అనడం చూస్తే పరిస్థితి అర్థమవుతోంది. పాక్ ఆడిన రెండో మ్యాచ్ తో అంతా సర్థుకొంది. సోమవారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ సంచలన ఆటతీరుతో ఆకట్టుకొంది. ఫెవరేట్ కి పంచ్ ఇచ్చింది.

టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన పాక్.. హఫీజ్‌ (84; 62 బంతుల్లో 8×4, 2×6), బాబర్‌ అజామ్‌ (63; 66 బంతుల్లో 4×4, 1×6), సర్ఫ్‌రాజ్‌ (55; 44 బంతుల్లో 5×4) మెరవడంతో 8 వికెట్లకు 348 పరుగులు చేసింది. అనంతరం 349పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రూట్‌ (107; 104 బంతుల్లో 10×4, 1×6), బట్లర్‌ (103; 76 బంతుల్లో 9×4, 2×6) సెంచరీలు కొట్టినా.. ఇంగ్లాండ్‌ 9 వికెట్లకు 334 పరుగులే చేయగలిగింది. బంతితోనూ రాణించిన హఫీజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది. వాహబ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. షాదాబ్‌, ఆమిర్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.