కేంద్రం.. కిలో తీపి కబురు !
కేంద్ర తీపి కబురు చెప్పింది. రేషన్ కార్డు దారులకి అదనంగా కిలో చెక్కెరని పంపిణీ చేయాలని నిర్ణయించింది. భారత ఆహార సంస్థ వద్ద సరకు అధికంగా ఉండడంతో తగిన సౌకర్యాలు లేక వాటిని ఆరుబయటే నిల్వ చేయాల్సి వస్తోంది. దీంతో వర్షాకాలం ముందు నిల్వలను ఖాళీ చేయాలన్న ఉద్దేశంతో రేషన్‌కార్డులపై ఒకటి రెండు కేజీలు అదనంగా బియ్యం/గోధుమలు సరఫరా చేయనుంది.
దీనివల్ల అదనంగా 16.3 కోట్ల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ప్రభుత్వానికి అదనంగా రూ.4,727 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం అంత్యోదయ అన్న యోజన కార్డుదార్లకు మాత్రమే కిలో రూ.13.50కు చొప్పున పంచదార పంపిణీ చేస్తుండగా, దీన్ని ఇతర వర్గాలవారికి కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది.