యశ్ ముద్దుగుల కూతురు వీడియో.. వైరల్ !

కన్నడ స్టార్ యశ్ ముద్దుల కూతురు వీడియో ఒకటి సోషల్ వైరల్ అవుతోంది. క‌న్న‌డ స్టార్ హీరో యశ్ గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో తండ్రి ప్ర‌మోష‌న్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. య‌శ్-రాధిక పండిట్ దంపతులకి ఆడబిడ్డ జన్మించింది. యషిక పేరు పెట్టారు. ఇప్పుడు యషికకు 6 నెలలు పూర్తయిన సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ముద్దులొలికే చిన్నారి యషిక వీడియో అభిమానుల హృదయాలు దోచుకునే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతుంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన యష్ ‘కెజీఫ్’ ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించింది. బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. ప్రస్తుతం కెజీఎఫ్ 2 తెరకెక్కుతోంది. సీక్వెల్ లో పలువురు బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు.