రివ్యూ : భారత్

చిత్రం : భారత్ (2019)

నటీనటులు : సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, దిశా పటానీ, సునీల్‌ గ్రోవర్‌, టబు, జాకీ ష్రాఫ్‌ తదితరులు

సంగీతం: విశాల్‌, శేఖర్‌

దర్శకత్వం : అలీ అబ్బాస్‌ జాఫర్‌

నిర్మాణ సంస్థ : రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్స్‌, సల్మాన్‌ ఖాన్‌ ఫిలింస్‌, టీ సిరీస్‌

విడుదల తేది : 05జూన్, 2019.

రేటింగ్ : 4/5

రంజాన్ పండగ సల్మాన్ ఖాన్ అభిమానులకి చాలా ప్రత్యేకమైనది. ఆ రోజు కచ్చితంగా సల్మాన్ కొత్త సినిమా విడుదలవుతూ ఉంటుంది. పెద్ద విజయాన్ని నమోదు చేస్తుంటుంది. ఈ రంజాన్ కి సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్’ సినిమా వచ్చేసింది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ దర్శకత్వం వహించారు. కైత్రినా కైఫ్, టబు, దిషా పటానీ, సునీల్ గ్రోవర్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు. ‘భారత్’ ఎలా ఉంది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

భారత దేశంతో పాటు.. భారత్‌ (సల్మాన్‌) కలిసి చేసిన ప్రయాణమే ఈ సినిమా కథ. స్వాతంత్య్రం, దేశ విభజన, నిరుద్యోగం, ఎమర్జెన్సీ, ఆర్థిక మాంద్యం.. ఇలా ప్రతి దశనూ దాటుకుంటూ, ప్రతి సవాల్‌నూ ఎదుర్కొంటూ, ప్రతి గాయాన్నీ తట్టుకుంటూ భారత్‌ ఎలా ఎదిగారన్నది ఈ సినిమాలో చూపించారు. ఐతే, భారత్‌ జీవితంలో కనిపించని ఓ విషాదముంటుంది. బాల్యంలో తండ్రికి (జాకీ ష్రాఫ్‌)కి ఇచ్చిన మాటే అతణ్ని బతికిస్తుంటుంది. ఆ విషాదమేంటి? తండ్రికిచ్చిన మాటను భారత్‌ నిలబెట్టుకున్నాడా? భారత్‌ జీవితంలో కుముద్‌ (కత్రినా కైఫ్‌) పోషించిన పాత్రేంటి ? అన్నది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* కథ, కథనం

* సల్మాన్‌, కత్రినా కెమిస్ట్రీ

* ఎమోషనల్ సీన్స్

* డైలాగులు

* పాటలు

* నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :

* అక్కడక్కడ స్లో నేరేషన్

* లాజిక్ దూరంగా కొన్ని సన్నివేశాలు

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో జరిగిన ముఖ్యమైన విషయాలను చక్కగా ప్రస్తావించారు. ‘ఓడ్‌ టు మై ఫాదర్’ అనే కొరియన్‌ సినిమాకు ఇది రీమేక్‌గా వచ్చింది. సినిమాలో భారతీయ హంగులు జోడించి దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ బాగానే తెరకెక్కించారు.

సల్మాన్‌ను 20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు ఐదు విభిన్నమైన గెటప్స్‌లో చూపించారు. లాజిత్ తన నటనతో నవ్విస్తాడు. ఏడిపిస్తాడు కూడా. తన కెరీర్ లోనే ది బెస్ట్ ఫర్ ఫామెన్స్ ఇచ్చారు. 1970లో వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి.

సల్మాన్ ఖాన్ – కత్రినా కైఫ్ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యవ్వనంలో సల్మాన్ ప్రియురాలిగా దిశా పటాని ఆకట్టుకొంది. ఆమె గ్లామర్ షో హైలైట్ గా నిలిచింది. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు. సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్ గా నిలిచింది.

సాంకేతికంగా :

సల్మాన్‌ భావోద్వేగపు సంభాషణలు సింపుల్‌గా, షార్ప్‌గా ఉంటాయి. విశాల్‌, శేఖర్‌ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. కెమెరా టేకింగ్‌ బాగుంది. కొన్ని లాజిక్ లేని సన్నివేశాలున్నాయి. కొన్ని సన్నివేశాలని ట్రిమ్ చేయొచ్చు కూడా. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.

చివరగా : ఎమోషనల్ గా.. భారత్ ప్రయాణం !

రేటింగ్ : 4/5