భారత్ టార్గెట్ 228
ప్రపంచకప్-2019 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతోంది. టాస్ గెలచి మొదటి బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 50ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 227 పరుగులు చేశారు. క్రిస్ మోరీస్ 42, డుప్లెసిస్ 38, Andile Phehlukwayo 34, రబడా 31 పరుగులు చేశారు. భారత బౌలర్లలో చహాల్ 4, బూమ్రా, భువనేశ్వర్ చెరో రెండు వికెట్లు, కులదీప్ ఒక వికెట్ తీశారు.
ఆరంభంలో బూమ్రా (2), ఆ తర్వాత చహాల్ (4) సఫారీల స్వీడుకు బ్రేకులు వేశారు. ఓ దశలో సఫారీలు పూర్తి ఓవర్లు ఆడేలే కనిపించలేదు. ఐతే, టేలెండర్లు రాణిస్తుండటంతో ఆ జట్టు స్కోరు 200స్కోర్ దాటేసింది. ఐతే, 228 పోరాడే స్కోర్ అని చెప్పవచ్చు. సఫారీల బౌలింగ్ పదునుగానే ఉంది. టీమిండియా భాగస్వామ్యాలపై దృష్టిపెడితే గెలుపు ఈజీ కావొచ్చు.