కైఫ్ స్క్వేర్

కైఫ్ తో కైఫ్ ఫోటో ఒకటి ఆకట్టుకుంటోంది. టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ దూకుడు గురించి తెలిసిందే. చకచకా సింగిల్స్ తీయడమే కాదు. ఫీల్డింగ్ లో అదరగొట్టే కైఫ్ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. యువరాజ్, కైఫ్ దాదాపు ఒకే టైంలో జట్టులోకి వచ్చారు. కొన్ని మ్యాచ్ ల్లో వీరిద్దరు కలిసి జట్టుని గెలిపించారు కూడా.

తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కలిసి మహమ్మద్ కైఫ్ దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం భారత్ రంజాన్ కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కత్రినా కైఫ్ కి మహమ్మద్ కైఫ్ తారసపడ్డాడు. కైఫ్ లిద్దరు కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజుచ్చారు. ఆ ఫోటోని మీరు చూడండీ.. !