మన్మథుడుతో మహానటి రొమాన్స్


మన్మథుడు నాగార్జున పేరు నిలబెట్టుకొంటున్నాడు. రొమాన్స్ లో రెచ్చిపోతున్నాడు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తో పని కానిచ్చేశాడు. ఇప్పుడు మహానటి కీర్తి సురేష్ తో రొమాన్స్ మొదలెట్టాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు2’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే సమంత తన పాత్రకి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసింది. ఇప్పుడు కీర్తి సురేష్ వంతు వచ్చింది. మంగళవారం కీర్తి సురేష్ ‘మన్మథుడు2’లో షూటింగ్ లో జాయిన్ అయింది. తొలిరోజే మన్మథుడుతో రొమాన్స్ చేసిది మహానటి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటికొచ్చాయ్. వైరల్ అవుతున్నాయి.

ఇక, ఈ చిత్రాన్ని 2002లో వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ గా భావిస్తున్నారు. ఐతే, మన్మథుడు కథకి రివర్స్ లో మన్మథుడు2 ఉండబోతుందని తెలిసింది. దసరా కానుకగా రెండో మన్మథుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.