కొడుకు పేరు ‘అర్జున్ రెడ్డి’ పెట్టుకొన్నాడు

‘అర్జున్ రెడ్డి’ రూల్స్ బ్రేక్ చేశాడు. ట్రెండ్ సెట్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతో విజయ్ జాతకమే మారిపోయింది. క్రేజీ హీరోగా మారాడు.

ఇది దర్శకుడు సందీప్ వంగా తొలి సినిమా. సినిమా చూస్తే దర్శకుడు ప్రాణం పెట్టి తీశాడనే విషయం అర్థమవుతోంది. నిజంగానే ‘అర్జున్ రెడ్డి’ అంటే సందీప్ కి ప్రాణం. ఆ పేరుని తన కొడుకుకి పెట్టుకొన్నాడు.

అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ తీశాడు సందీప్. షాహిద్ కపూర్-కైరా అద్వానీ జంటగా నటించారు. ఈ నెల 21న కబీర్ సింగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సందీప్.. ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

” ‘అర్జున్ రెడ్డి’ సినిమాను నేను ఓ యజ్ఞంలా భావించి.. నా ప్రాణం పెట్టి చేశా. ఈ నా ప్రయత్నంలో నిర్మాతలు,కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది . అందుకే నా కొడుకుకి ‘అర్జున్ రెడ్డి’ అనే పేరు పెట్టుకున్నాను. ఆ సినిమా అంటే నాకు ఎంత ఇష్టమనేది ఇప్పుడు మీకు అర్థమైపోయుంటుంది” అన్నారు.