హీరోయిన్స్’ని వాడుకొంటున్న విజయ్ దేవరకొండ దర్శకుడు


సౌత్ మెగాస్టార్ అనిపించుకొనే ప్రయత్నంలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. తన సినిమాలని సౌత్ బాషలన్నింటీలో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకొంటున్నారు. ‘నోటా’తో తమిళ ప్రేక్షకులని పలకరించాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘డియర్ కామ్రేడ్’ సౌత్ బాషలన్నింటీలోనూ జులై 26న విడుదల కానుంది. కొత్త దర్శకుడు ఆనంద్ అన్నాములై దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ‘హీరో’ సినిమా తెలుగు, తమిళ బాషల్లోనూ విడుదలకానుంది. దీంతో సౌత్ లో విజయ్ క్రేజ్ పెరుగుతోంది.

ఆ క్రేజ్ ని దర్శకులు వాడుకొంటున్నారు. విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని హీరోయిన్స్ ని పడకగదికి పిలుస్తున్నారు దర్శకులు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బయటికొచ్చింది. ఓ రాత్రి పడుకుంటే, విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని ఓ దర్శకుడు తనకు “ఆఫర్” ఇచ్చాడంటూ ఆరోపణలు చేసింది తమిళ నటి షమ్ము. ఆ దర్శకుడి పేరు మాత్రం చెప్పలేదు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరై ఉంటాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.