సుకుమార్ ఒక్కరే బుక్కయ్యారు.. !
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ బుక్కయ్యారని ఇండస్ట్రీ టాక్. ‘ఫలక్‌నుమాదాస్’ సంచలన విజయం సాధిస్తుందని ఇండస్ట్రీ ప్రముఖులు ముందే ఫిక్సయ్యారట. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లని చూస్తే అది గ్యారెంటీ అనుకొన్నారంట. అందుకే చాలా మంది ఈ సినిమా కోసం ఉత్సాహంగా బైట్స్ ఇచ్చారు. వాటిని సినిమా విడుదల తర్వాత ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకోవాలని దర్శకుడు, హీరో విశ్వక్ సేన్ అనుకొన్నారు. ఐతే, సినిమా విడుదల తర్వాత పరిస్థితి మారింది. సినిమాపై నెగటివ్ ప్రచారం ఓ రేంజ్ లో జరిగింది
సినిమాని బాగా ట్రోల్ చేశారు. దానిపై విశ్వక్ సేన్ స్పందించిన తీరు కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో అప్పటికే సినిమా కోసం బైట్స్ ఇచ్చిన ప్రముఖులు వాటిని విడుదల చేయొద్దని చిత్రబృందాన్ని కోరారట. సుకుమార్ మాత్రం తన బైట్ ని ప్లే చేయమని చెప్పారు. ‘ఫలక్‌నుమాదాస్’ని సుక్కు ప్రశంసించారు. గొప్ప సినిమా. హైదరాబాద్ కల్చర్ ని ఇంతకంటే గొప్పగా ఇంకెవ్వరు చూపించలేరు. గతంలో తాను కూడా ట్రై చేశానన్నారు. తనకు మాత్రం ‘ఫలక్‌నుమాదాస్’ లో ఎక్కడా బూతు కనిపించలేదన్నారు. దీంతో.. సుక్కుపై ట్రోలింగ్ మొదలైంది. అయినా.. పర్వాలేదు. ఆయన ఓ చిన్ని సినిమాకి మద్దతు నిలిచారు.
Director @aryasukku sir on our #FalaknumaDas .
Thank you so much for mentioning each & every cast n crew in detail.
Your words have such a power that given us #Massive strength💪@SureshProdns
@vishwaksens#DasKaMassHit pic.twitter.com/MC7HFLWDsx— Falaknuma Das (@FalaknumaDas) June 3, 2019