రివ్యూ : కిల్లర్
చిత్రం: కిల్లర్ (2019)
నటీనటులు : విజయ్ ఆంటోనీ, అర్జున్, ఆషిమా నర్వాల్, సీత, నాజర్, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రామ్ తదితరులు
సంగీతం : సైమన్ కె.కింగ్
దర్శకత్వం: ఆండ్రూ లూయిస్
నిర్మాతలు : టి.నరేష్ కుమార్- టి.శ్రీధర్
రిలీజ్ డేటు : 07జూన్, 2017
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేశాడు తమిళ్ హీరో విజయ్ దేవరకొండ. బిచ్చగాడు తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడలవుతుంది. మంచి కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి. ఐతే, ‘బిచ్చగాడు’ రేంజ్ విజయాన్ని మాత్రం అందుకోవడం లేదు. ఈసారి అర్జున్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ కథతో ‘కిల్లర్’ చేశారు. మరీ.. ‘కిల్లర్’ ఉన్నాడు ? తెలుగు ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాడు తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
మినిస్టర్ తమ్ముడు వంశీ హత్య చేయబడతాడు. వంశీ హత్యకి కారకులుగా జయంతి (ఆషిమా నర్వాల్), ఆమె తల్లి (సీత)ని అనుమానిస్తుంటాడు పోలీసు అధికారి కార్తికేయ (అర్జున్). ఇంతలో ఆ హత్య చేసింది తానేనంటూ ప్రభాకర్ (విజయ్ ఆంటోనీ) పోలీసులకి చెప్పి అరెస్ట్ అవుతాడు. కార్తికేయ మాత్రం దాన్ని నమ్మడు. కేసుని రకరకాల కోణాల్లో పరిశోధించడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో కార్తికేయకు పలు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అవేంటి ? అసలు ప్రభాకర్ ఎవరు? ఆయనకీ జయంతికీ మధ్య సంబంధం ఏమిటి ? వంశీని నిజంగా ప్రభాకరే హత్యచేశాడా ? అన్నది సస్పెన్స్ తో కూడిన మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
* స్క్రీన్ ప్లే
* అర్జున్, విజయ్ ఆంటోనీల నటన
* నేపథ్య సంగీతం
* థ్రిల్లింగ్ అంశాలు
మైనస్ పాయింట్స్ :
* ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తించడం, ఊహించని మలుపులతో థ్రిల్‌కి గురిచేయడం సస్పెన్స్ థ్రిల్లర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణం. ఆ విషయంలో దర్శకుడు ఆండ్రూ లూయిస్ సక్సెస్ అయ్యారు. మొదట ప్రేక్షకుల మనసుల్లో ప్రశ్నల్ని రేకెత్తిస్తూ, ఆ తర్వాత కథలో చిక్కుముడుల్ని ఒకొక్కటిగా విప్పుతూ వాటితోనే ప్రేక్షకుడి మదిలో మెదిలిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం థ్రిల్‌కి గురిచేస్తుంది. తొలిభాగంలో ఏమాత్రం కథని రివీల్ చేయలేదు. సస్పెన్స్ అంశాలతో కథని ముందుకు నడిపించాడు.
ఇక ద్వితీయార్థంలో చిక్కుముడుల్ని ఒకొక్కటిగా విప్పుతూ.. లాజిక్ లకి సమాధానం ఇస్తూ చాలా కన్విన్సింగ్ కథని డీల్ చేశాడు. ఫలితంగా కిల్లర్ మంచి క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తుంది. ప్రభాకర్ పాత్రలో విజయ్ ఆంటోనీ చాలా సహజంగా నటించారు. కార్తికేయ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒదిగిపోయాడు. అర్జున్ నటించడం వలనే ఈ కథని పరిపూర్ణత వచ్చిందని చెప్పవచ్చు. ఆషిమా నర్వాల్ అందం, అభినయంతో ఆకట్టుకొంది. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
సంగీత దర్శకుడు సైమన్.కె.కింగ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు ఫర్వాలేదనిపిస్తాయి. మాక్స్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బాటమ్ లైన్ : కిల్లర్.. ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్
రేటింగ్ : 3.25/5