‘కిల్లర్’ ఎలా ఉన్నాడంటే ?

తమిళ్ హీరో విజయ్ ఆంటోనీకి టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది. యాక్షన్ హీరో అర్జున్ తో కలిసి ఆయన నటించిన చిత్రం ‘కిల్లర్. రంజాన్ కానుకగా ‘కిల్లర్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ స్పెన్స్ మర్డర్ థ్రిల్లర్ మంచి టాక్ ని తెచ్చుకొంది. ఇందులో
సీనియర్ హీరో అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా, హీరో విజయ్ ని హంతకుడిగా నటించారు. ఐతే, కథని ఏమాత్రం రివీల్ చేయకుండా ఫస్టాఫ్ ని డీల్ చేశారు. సెకాంఢాఫ్ లో అసలు కథని చెబుతూ.. లాజిక్ లని రివీల్ చేస్తూ కథని గ్రిప్పింగా చెప్పారు.

పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ నటన అదిరిపోయింది. కిల్లర్ పాత్రలో విజయ్ ఆంటోని మెప్పించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు పండగ చేసుకొనేలా ఉన్నాయని చెబుతున్నారు. హీరోయిన్ ఆషిమా గ్లామర్ సినిమాకు ప్లస్ అయింది. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా.. సెకాంఢాఫ్ అద్భుతంగా ఉంది. నేపథ్య సంగీతం సినిమాని స్థాయిని పెంచేలా ఉందని పబ్లిక్ టాక్. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులని కిల్లర్ వందశాతం మెప్పిస్తాడని చెబుతున్నారు.