సమంత మనవడిని గుర్తుపట్టారా.. ?

నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన చిత్రం ‘ఓ బేబీ’. ‘ఒక మనిషికి సెకండ్‌ లైఫ్ వస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కథ’. చాలా వినోదాత్మకంగా ఉంటుందట. ఇందులో సమంత మనవడిగా తేజ కనిపించనున్నాడు. ఇంతకీ తేజ ఎవరో తెలుసా ? మాస్టర్‌ తేజ. ‘చూడాలని ఉంది’, ‘యువరాజు’ సహా చిరంజీవి బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఇంద్ర’లో చిన్నప్పటి చిరుగా కత్తిపట్టి.. తొడకొట్టి అభిమానులను అలరించిన మాస్టర్ తేజ. ఇప్పుడు పెద్దాయ్యాడు. ఓ బేబీలో సమంత మనవడిగా నటించారు.

గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తేజ కూడా పాల్గొన్నాడు. ‘ఓ బేబీలో సమంతగారు ఓల్డ్‌ ఏజ్‌ నుంచి యంగ్‌ ఏజ్‌కు వస్తారు. నేను చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి పెద్దగా అయ్యాను. అంతే తేడా అన్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై డి.సురేష్‌బాబు ‘ఓ బేబీ’ని నిర్మిస్తున్నారు. లక్ష్మి, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ బేబీ జులై 5న ప్రేక్షకుల ముందుకురానుంది.