నిక్’తో భేదాభిప్రాయాలు నిజమే : ప్రియాంక
భర్త నిక్ జోనస్ తో భేదాభిప్రాయాలు నిజమేనని తెలిపింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. పెళ్లైన కొన్నాళ్లకి వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. విడాకులు తీసుకొనేందుకు కూడా రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియాంక స్పందించింది. “మొదట బాగానే ఉండేవాళ్లం. కానీ పెళ్లైన తర్వాత చిన్న చిన్న భేదాభిప్రాయాలు తలెత్తాయి.
సంప్రదాయ వ్యత్యాసాల్లో ఒక్కోసారి తను సర్దుకుపోతాడు. మరోసారి నేను. ఏం జరిగినా మన మంచికే” అనుకొంటాం అని తెలిపింది.
అంతేకాదు.. కొంతమంది సైగలతో మాట్లాడుకుంటారు. మేము మాత్రం మనసులతోనే మాట్లాడుకుంటాం. తను నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు అంటూ భర్త గురించి గొప్పగా చెప్పుకొచ్చింది ప్రియాంక. ప్రస్తుతం నిక్ వరుస మ్యూజిక్ కన్సర్ట్‌లతో బిజీగా ఉండగా.. ప్రియాంక ‘స్కై ఈజ్ పింక్’ అనే బాలీవుడ్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అన్నట్టు.. నిక్ కంటే ప్రియాంక పదేళ్లు పెద్దది. దీనిపై నెటిజన్లు నేటికీ ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అవేవీ పట్టించుకోకుండా భర్తతో హాయిగా కాపురం చేసుకొంటోంది.