రవిప్రకాష్ అరెస్ట్ తప్పదా ?

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ అరెస్ట్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన్ని గత మూడు రోజులుగా టీవీ9 వాటాల వివాదం కేసుకు సంబంధించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారిస్తున్నారు. ఐతే, రవిప్రకాశ్‌ దర్యాప్తునకు సరైన రీతిలో సహకరించడంలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక, రవిప్రకాష్ ఇవాళ బంజారాహిల్స్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆయన్ని ఏసీపీ కేఎస్‌ రావు ప్రశ్నించారు. మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు టీవీ 9 ట్రేడ్‌ మార్క్‌, కాపీ రైట్లు ఎందుకు విక్రయించారనే దానికి సంబంధించి రవిప్రకాశ్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీనిపై రవిప్రకాష్ ఇచ్చిన వివరణ ఏంటన్నది తెలియాల్సి ఉంది.