సల్మాన్ సీక్రెట్స్’ని బయటపెట్టబోతున్న ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన బాలీవుడ్ కెళ్లారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సీక్రెట్స్ ని ఇంటర్వ్యూ చేశారు. సల్మాన్ సీక్రెట్స్ ని కూపీలాగారు. త్వరలోనే వాటిని బయటపెట్టనున్నారు. తాజాగా, దానికి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల చేశారు. ఇప్పుడీ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అపోలో స్టూడియోస్ ‘బీ-పాజిటివ్’ పేరుతో వారానికో సెలబ్రేటీ ఫిట్ నెస్ విశేషాలని పంచుకొంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్స్ సమంత, కాజల్.. తదితరులని ఉపాసన ఇంటర్వ్యూ చేశారు. ‘భారత్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఉపాసనకి స్పెషల్ ఇంటర్వూ ఇచ్చారు సల్మాన్. ఆ పూర్తి ఇంటర్వ్యూని త్వరలోనే విడుదల చేయనున్నారు.