ఏపీ అసెంబ్లీ స్వీకర్ గా తమ్మినేని !

ఏపీ అసెంబ్లీ స్వీకర్ గా తమ్మినేని సీతారామ్‌ ని నియమించినట్టు సమాచారమ్. స్వీకర్ పదవి కోసం చాలామంది పేర్లు వినిపించినా.. తమినేని పేరు ఫైనల్ అయినట్టు తెలిసింది. ఇక, డిప్యూటీ స్పీకర్‌గా పీడిక రాజన్న దొరను అనుకొంటున్నట్టు తెలుస్తోంది. ఈనెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందే ఏపీ మంత్రివర్గం కొలువుదీరనుంది.

శనివారం ఉదయం సచివాలయ ప్రాంగణంలో కొత్త మంత్రులతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మొత్తం 25మందితో జగన్ కేబినేట్ కొలువుదీరనుంది. వీరిలో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా, 20మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే రేపు ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రులకి సీఎం కార్యాలయం నుంచి సమాచారం కూడా అందింది.