ఈ సారి జాకెట్ లేకుండానే.. !


గ్లోబర్ల్ స్టార్ ప్రియాంక చోప్రా పెళ్లైన తర్వాత కూడా పద్దతి మార్చుకోవడం లేదు. గతంలో కంటే మిన్నగా అందాలు ఆరబోస్తోంది. పబ్లిక్ గానే మొగుడు నిక్ తో రొమాన్స్ చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని సార్లు విమర్శలని ఎదుర్కొంటోంది. తాజాగా, ప్రియాంక జాకెట్ లేకుండా చేసిన ఫోటో షూట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇందులో చీర కట్టుకొని బ్యాక్ ఫోజుతో అదరగొట్టింది.

చీర కట్టులో అందంగా కనిపించే ప్రియాంక ఏకంగా జాకెట్ లేకుండా చీరతో ఫోజులు ఇవ్వడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రియాంక జాకెట్ లేకుండా చీర కట్టుకొని ఫోటోలు దిగి ఇండియా పరువు తీసిందని నెటిజన్లు వాపోతున్నారు. ఐతే, ఎప్పటిలాగే ప్రియాంక ఇలాంటి విమర్శలేమీ పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకోపోతుంది అనుకోండీ.