బిగ్ బాస్ 3 కోసం బండ్ల, కెఎ పాల్ కూడా.. !!

బిగ్ బాస్ 3 కోసం క్రేజీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హోస్ట్ గా కింగ్ నాగార్జున ఫిక్సయ్యారు. దాంతో పార్టిసిపెంట్ల కోసం వేట మొదలయింది. కాస్త క్రేజీ హౌస్ మేట్స్ కోసం నిర్వాహకులు వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ పేరు వినిపిస్తోంది. ఆమె దాదాపు ఓకే చెప్పినట్టు తెలిసింది. పొలిటికల్ ఎంటర్ టైనర్లు బండ్ల గణేష్, కెఎ పాల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బండ్లని నిర్వాహకులు సంప్రదించారు కూడా.

ఐతే, బండ్ల చిత్రమైన కండిషన్ పెట్టి, నో చెప్పినట్లు తెలుస్తోంది. తనకు వీలయినంత వరకు ఫోన్ అందుబాటులో వుండాలని, కుటుంబ సభ్యలతో టచ్ లో వుండే అవకాశం వుండాలని బండ్ల గణేష్ కోరినట్లు తెలుస్తోంది. బండ్ల పెట్టిన కండీషన్స్ బిగ్ బాస్ రూల్స్ కి పూర్తిగా వ్యతిరేకం. ఇక, కెఎ పాల్ ఇంకా అందుబాటులోకి రాలేదు. పాల్ ఒకే చెబితే.. బిగ్ బాస్3 మాములుగా ఉండదేమో !
ఫ్యామిలీ చిత్రాల హీరో తొట్టెంపూడి వేణు పేరు కూడా బిగ్ బాస్ 3 కోసం వినిపిస్తోంది. ఒకరిద్దరు యాంకర్ లని సంప్రదించినట్టు తెలిసింది.