అనుపమ-బుమ్రా ప్రేమలో ఉన్నారా ?

టీమిండియా పేసర్‌ జస్ర్పీత్‌ బుమ్రా టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ తో ప్రేమలో ఉన్నారా ? అంటే అవుననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి ఎప్పుడు.. ఎక్కడా కనిపించలేదు. కానీ, వీరిద్దరూ సోషల్‌మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. సోషల్‌మీడియాలో బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ అనుపమే కావడం విశేషం. అంతేకాదు వీరిద్దరూ పెట్టే పోస్ట్‌లను కూడా తెగ లైక్‌ చేసుకుంటూ ఉంటారట. దాంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ.. నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

క్రికెటర్స్ హీరోయిన్స్ వెంట పడటం, ప్రేమలో పడటం సాధారణ విషయమే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న కెఎల్ రాహుల్ ఒకరిద్దరు హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడు. వాటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఐతే, అనుపమ-బూమ్రా జంట మాత్రం చాలా ప్రత్యేకం. వీరిద్దరూ సలైంట్ గా ప్రేమించు కొంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన అనుపమ బుమ్రా తనకు మంచి స్నేహితుడని క్లారిటీ ఇచ్చింది.

అన్నట్టు.. అనుపకి సవతి పోరు కూడా ఉందండోయ్. మరో టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నాకు బూమ్రా అంటే పిచ్చ లైకు. బూమ్రాపై తనకున్న ఇష్టాన్ని పలుమార్లు బయటపెట్టింది రాశీ. బూమ్రా కోసమే క్రికెట్ మ్యాచ్ లు చూస్తుంటా. బూమ్రాని చూడగానే కొత్త ఫీలింగ్ కలుగుతోందని ఓపెన్ గా చెప్పేసింది. ఐతే, రాశీ చెప్పిన మాటలు బూమ్రా చెవికి చేరనట్టున్నాయి. ఆయన అనుపమతో స్నేహం చేస్తున్నాడు. అది ప్రేమగా మారి పెళ్లికి వరకు వెళ్తుందేమో చూడాలి.