దక్షిణాఫ్రికా.. ఇకపై అన్నీ మ్యాచ్‌లు గెలవాల్సిందే !

అన్నీ ఉన్నా.. అదృష్టం ఆవగింజతైనా ఉండాలంటారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఆ అదృష్టమే లేదు. ప్రపంచకప్ ఆడుతున్న బలమైన జట్టలో దక్షిణాఫికా ఒకటి. ఐతే, ఆ జట్టు ఆడిన మొదటి మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. సోమవారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో దక్షిణాఫ్రికా ఖాతా తెరిచింది. పాయింట్ల పట్టికలో ఓ పాయింట్ ని చేర్చుకొంది.

ప్రస్తుత ప్రపంచకప్‌ రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో నిర్వహిస్తుండగా దక్షిణాఫ్రికా ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకొని ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. దీంతో ఆ జట్టులో ఆందోళన మొదలైంది. ప్రపంచకప్‌లో కొనసాగాలంటే ఇకపై ఆడే అన్ని మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. గతంలో 1992, 2003 ప్రపంచకప్‌లో వర్షం కారణంగా దక్షిణాఫ్రికా కప్ ని గెలిచే అవకాశాలని కోల్పోయింది. తాజా వరల్డ్ కప్ లోనూ ఆ జట్టు సెమీస్ ఆశలని వరుణుడు దెబ్బతీశాడని చెప్పవచ్చు.