విచిత్రం : జగన్ సాక్షిగా ప్రమాణస్వీకారం

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు ఓ విచిత్రం జరిగింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ‘నా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి సాక్షిగా.. ‘ అంటూ ప్రమాణస్వీకారం చేశారు. ఐతే, నిబంధనల ప్రకారం వ్యక్తులపై ప్రమాణస్వీకారం చెల్లదని స్వీకర్ స్వీకర్ చెప్పడంతో.. కోటంరెడ్డి మరోసారి ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. సీఎం జగన్ పై కోటంరెడ్ది ప్రేమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సమయంలో జగన్ మొహంలో కూడా కాసింత గర్వం కనిపించింది.

ఇక, ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారంతోనే గడించింది. తొలిరోజు 175 మందికి 174 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. నరసారావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమావేశానికి గైర్హాజరయ్యారు. నేతలు ఒకరినొకరు పలకరింపులతో తొలిరోజు చాలా సరదాగా గడిచింది. హిందూపురం తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైకాపా ఎమ్మెల్యేలతో సరదాగా మాట్లడుతూ కనిపించారు. ఇక ముందు ఏపీ అసెంబ్లీలో అసలైన హీట్ కనిపించనుంది. జగన్, చంద్రబాబు మాటల యుద్ధానికి తెరలేపనున్నారు. గతంలోనూ వీరిద్దరు గట్టిగా ఢీకొన్న సందర్భాలున్నాయి. ఈ సారి అంతే. కాకపోతే.. స్థానాలు మారాయి.