పాకిస్థాన్‌ టార్గెట్ 308

పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే ఆ మజాయే వేరు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ పాక్ సైతం రసవత్తరంగా జరుగుతోంది. మొదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 307 పరుగులకి ఆలౌట్‌ అయింది. 34 ఓవర్లకు ఆసీస్ 223/2తో నిలిపింది. ఆ జోరు చూస్తే 370కి పైగా స్కోరు చేయడం ఖాయమే అనిపించింది. ఇంతలో పాక్ అద్భుతం చేసింది. కేవలం 84 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు తీసింది. మరో ఓవర్‌ ఉండగానే కంగారూలను 307కు ఆలౌట్‌ చేసింది. మహ్మద్‌ ఆమిర్‌ (10-2-30-5) అంతర్జాతీయ కెరీర్‌లో తొలిసారి 5 వికెట్లు పడగొట్టాడు.

ఆసీస్‌లో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (107; 111 బంతుల్లో 11×4, 1×6) శతక బాదాడు. అతడికి తోడుగా మరో ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌(82; 84 బంతుల్లో 6×4, 4×6) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 146 పరుగులు జోడించారు. మిగితా ఆటగాళ్లు
వెంటవెంటనే ఔటవ్వడంతో ఆసీస్ 307పరుగులకే పరితమైంది. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్‌ అఫ్రిది 2 వికెట్లు తీశాడు. హసన్‌ అలీ, వాహబ్‌ రియాజ్‌, మహ్మద్‌ హఫీజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.