పంత్’కు పిలుపొచ్చింది.. !

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడిన నేపథ్యంలో.. టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ కు బీసీసీఐ నుంచి పిలుపొచ్చింది. వీలైనంత త్వరలో ఇంగ్లాండ్ రావాలని, టీమిండియాతో చేరాలని బీసీసీఐ అధికారులు సూచించారు.

చేతివేలికి గాయమైన ధావన్ కు మూడు వారాల విశ్రాంత్రి అవసరమని డాక్టర్లు సూచించారు. ఆ తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించిన తర్వాతే.. ధావన్ మిగితా మ్యాచ్ లు ఆడటంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ధావన్ జట్టులో కొనసాగే అవకాశాలు చాలా తక్కువని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా రిషబ్ పంత్ ని ఇంగ్లాండ్ కు పిలిపిస్తున్నారు.

రేపు (గురువారం) టీమిండియా న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ స్థానంలో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తారు. నాలుగో స్థానంలో దినేష్ కార్తీక్ లేదంటే విజయ్ శంకర్ ఆడే ఛాన్స్ ఉంది. ఇక ఆదివారం దాయాది దేశం పాకిస్థాన్ తో భారత్ ఢీ కొనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో పాక్ చేతిలో భారత్ ఓడింది లేదు. ఆ రికార్డుని ఈ సారి కూడా అలాగే ఉంచుతారా ? లేదంటే.. పాక్ సంచలనం సృష్టిస్తుందా ?? అనేది చూడాలి.