నారా లోకేష్ ప్రత్యర్థికి కీలక పదవి
మంగళగిరిలో చినబాబుని చిత్తుగా ఓడించాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. ఆళ్లకు మంత్రిపదవి ఖాయమని భావించినా కేబినెట్‌లో ఆయనకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయనకి కీలక పదవి అప్పగించారు సీఎం జగన్. ఆయన్ని రాజధాని నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సీఆర్‌డీఏ సంస్థకు ఛైర్మన్‌గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.
మంత్రి పదవి దక్కని నగరి ఎమ్మెల్యే రోజాకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఐతే, రెండున్నరేళ్ల తర్వాత సీఎం జగన్ మరోసారి కేబినేట్ విస్తరణ చేయనున్నారు. 90శాతం మంత్రులని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి, రోజాలకి అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.