జగన్’ని విలన్ చేద్దామనుకొన్నాడు.. కానీ !


‘జై సింహా’ తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా రావాల్సివుంది. ఇంతలో కెయస్ రవికుమార్ బాలయ్యని టెంప్ట్ చేశాడు. వైకాపా అధినేత వైఎస్ జగన్, ఆయన తాత రాజారెడ్డిని ఇద్దరనీ విలన్లుగా చూపిస్తూ ఓ కథని రాసుకొచ్చి.. బాలయ్యకు వినిపించాడు. అది బాలయ్యని ఆకట్టుకొంది. మళ్లీ తెదేపానే అధికారంలోకి వస్తుందని భావించిన బాలయ్య ఆ కథకి ఓకే చెప్పేశాడు. బోయపాటి సినిమాని పక్కనపెట్టీ మరీ.. కెయస్ రవికుమార్ సినిమాని చేయడానికి రెడీ అయ్యాడు.

ఇంతలో దేవుడి స్క్రిప్టు వేరేలా రాశాడు. ఏపీలో వైకాపా ఘన విజయం సాధించింది. తెదేపా కేవలం 23స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మారిన రాజకీయపరిణామల నేపథ్యంలో కెయస్ రవికుమార్ సినిమాని బాలయ్య చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్లీ బాలయ్య బోయపాటి వైపు చూశారు. ఇంతలో కెయస్ కొత్తతో బాలయ్యని ఒప్పించాడు. పరుచూరి మురళి దగ్గర వున్న కథ తీసుకుని, అదే కేఎస్ రామారావుతో సి కళ్యాణ్ కొత్త సినిమా రాబోతుంది. ఈ సినిమా గురువారం ప్రారంభోత్సవం జరుపుకొంది.