జగన్ గొప్ప నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకొన్నాడు. పార్టీ ఫిరాయింపులని పోత్రహించేది లేదని తేల్చిచెప్పారు.
గురువారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ గా తమ్మినేని సీతారామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్.. కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఆపరేషన్ ఆకర్ష్ ఉండదని క్లారిటీ ఇచ్చారు.
తెదేపాకు 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారి నుంచి ఐదారుగురిని లాక్కుందామని చాలామంది చెప్పారు. టీడీపీ
ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేద్దామని అడిగారని సీఎం జగన్ తెలిపారు. ఐతే, అలా చేస్తే వాళ్లకు, మాకు తేడా ఏమి ఉంటుంది. పార్టీ మారాలనుకుంటే తప్పనిసరిగా ఆ పదవికి రాజీనామా చేసి రావాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు.
గత టీడీపీ ప్రభుత్వం పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని అడిగితే పట్టించుకోలేదు. అనర్హత వేటు వేయని ప్రభుత్వంపై ప్రజలే అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన పార్టీకి అక్షరాలా 23 సీట్లే వచ్చాయి. ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేస్తే అక్షరాలా మూడే మిగిలాయి. దేవుడు ఎంత గొప్పగా స్క్రిఫ్టు రాస్తాడో దీన్ని బట్టి అర్థమైందన్నారు సీఎం జగన్.