‘సాహో’ టీజర్ కౌంట్ డౌన్ వీడియో.. వైరల్

మరికొద్ది గంటల్లో ‘సాహో’ టీజర్‌ విడుదల కాబోతోంది. ఈ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంకంటే ముందే సాహో టీజర్ కౌంట్ డౌన్ పోస్టర్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. వెన్నెల కిశోర్‌, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.