ఆ ఇద్దరూ.. యువీని ఇబ్బంది పెట్టారట !
టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు విడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో యువీ మాట్లాడుతూ.. చాలా విషయాలున్నాయి. సమయం వచ్చినప్పుడు వాటిపై కచ్చితంగా మాట్లాడతా అన్నారు. ఐతే, అవి సంచలన విషయాలు అయి ఉంటాయని తెలుస్తోంది. ఈ విషయం పక్కనపెడితే.. యువీ తాను ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్ల పేర్లను వెల్లడించాడు. ఇద్దరు బౌలర్లను ఎదుర్కోవడం కష్టతరమైందని చెప్పాడు.
అందులో ఒకరు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కాగా మరోకరు ఆసిస్ మాజీ పేసర్ గ్లెన్‌మెక్‌గ్రాత్ అని వెల్లడించాడు.
విదేశీ ఆటగాళ్లలో అభిమానించే క్రికెటర్ రికీపాంటింగ్ అని చెప్పాడు. వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌లతో ఆడటాన్ని ఎంతో ఆస్వాదించానని యువీ పేర్కొన్నాడు. గత ఐపీఎల్ లో ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశం రాకపోవడం బాధించిందన్నారు యువీ.