చిరు చిన్నల్లుడిని వేధించింది.. వీరే !
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కు సైబర్ వేధింపులు ఎదురైన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం కళ్యాణ్ దేవ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పోస్ట్ చేసే ఫొటోల కింద ఓ 10 మంది వ్యక్తులు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. తన కుటుంబసభ్యులపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు 10 మందిని పట్టుకున్నారు. వారిపై ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసినట్టు సమాచారమ్. ఐపీ అడ్రెస్ల ద్వారా ఇన్స్టాగ్రామ్ యాజమాన్యం సైబర్ నేరగాళ్ళని గుర్తించి, వారి వివరాలని పోలీసులకి అందజేసినట్టు తెలుస్తోంది. ఐతే, పట్టుబడిన కుర్రాళ్ల వివరాలని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు.