ఝార్ఖండ్‌లో మావోల ఎటాక్.. 5గురు పోలీసులు మృతి !
ఝార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జంషెడ్‌పూర్ సమీపంలో పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా మావోలు ఎటాక్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు వాహనంలో ఉన్న ఆయుధాలను కూడా మావోలు ఎత్తుకు పోయారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఈ ఘటనని తీవ్రంగా ఖండించారు.
గత నెలలో దుమ్‌ఖా జిల్లాలో సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ), మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ సైనికుడు మృతి చెందగా మరో నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. అంతకు ముందు ఇదే ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో 11 భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలకి మరవక ముందే మావోలు మరోసారి రెచ్చిపోవడం.. పోలీసులకి ఛాలెంజ్ గా మారింది. మావోలని మట్టుపెట్టేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రఘుబర్ దాస్ తెలిపారు.