ఓ ‘బేబీ పాట పాడింది’.. !

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓ బేబీ’. నందిని రెడ్డి దర్శకురాలు. నాగశౌర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. జులై 5న ఓ బేబీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజగా ఈ సినిమా నుంచి #ChanguBhala లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సామ్ పాట పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ కపించారు. పాటపడుతున్న సమంతని నాగశౌర్య ఫోన్ లో చిత్రీకరిస్తూ కనిపించారు. భాస్కరభట్ల రాసిన ఈ పాటని నూతన్ మోహన్ పాడారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. #ChanguBhala లిరికల్ సాంగ్ ని మీరు చూసేయండీ.. !