మురుగదాస్‌’ని సప్రైజ్ చేసిన హాలీవుడ్ నటుడు

హాలీవుడ్‌ నటుడు బిల్ డ్యూక్‌ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌ ని సప్రైజ్ చేశాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో ‘దర్భార్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఐతే, ఈ సినిమా తనకు నటించాలని ఉందని బిల్ డ్యూక్ ట్విట్ చేశారు. రజనీకాంత్‌ను, మురుగదాస్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.

‘మురుగదాస్‌.. నాకు తమిళం రాదు. కానీ మీరు తీస్తున్న ‘దర్బార్‌’ సినిమాలో నటించాలని ఉంది. నేను రజనీకాంత్‌ సోదరుడి పాత్రలో కానీ నయనతారకు అంకుల్‌ పాత్రలోనైనా నటిస్తాను. అనిరుధ్‌ రవిచందర్‌ మాలాంటి స్టార్‌ నటుల కోసం ఓ మంచి పాటను కూడా కంపోజ్‌ చేస్తే బాగుంటుంది. ఏమంటారు?’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ చూసిన మురుగదాస్‌ షాకయ్యారు.

‘సర్‌.. ఇది నిజంగా మీరేనా?’ అని ప్రశ్నించారు. ఇందుకు బిల్‌ డ్యూక్‌ సమాధానంగా.. ‘హాలీవుడ్‌లో ఏజెంట్లు, మేనేజర్లు మా పనికి సంబంధించిన విషయాలను చూసుకుంటారు. కానీ మనలాంటి నటులు, దర్శకులు, రచయితలు, ఆర్టిస్ట్‌లు అద్భతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం మంచి సినిమాను అందించాలని కలలు కంటూ ఉంటాం’ అని ట్వీట్ చేశారు. మరీ.. బిల్ డ్యూక్ కోసం మురగదాస్ స్పెషల్ పాత్ర ఒకటి రెడీ చేస్తారేమో చూడాలి.