‘ఊరంతా అనుకొంటున్నారు’ జ్యూక్ బాక్స్.. మీ కోసం !

సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ ‘నందినీ నర్సింగ్ హోమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆయన నటించిన మరో చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’ కొన్ని కారణాల వలన విడుదల ఆగిపోయింది. నవీన్ తాజా చిత్రం ‘ఊరంతా అనుకొంటున్నారు’. ఈ చిత్రానికి బాలజీ దర్శకత్వం వహిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, మేఘా చౌదరి, సోపియా సింగ్, జయసుధ, రావు రమేష్, కోటా శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. మంగళంపల్లి శ్రీహరి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

తాజాగా, ఈ సినిమా జ్యూక్ బాక్స్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి కె. ఎం రాథాకృష్ణ సంగీతం అందించారు. సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయ్. ఓ పాటలో తెలంగాణ ఫోక్ సాంగ్ ‘గొల్లమల్లమ్మ కోడలా.. ‘ బీట్ వినిపించింది. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుడు తెలుస్తుంది.. ఊరంతా ఏం అనుకుంటున్నారని.