రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.. డీటేల్స్ !
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పెళ్లి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అభిమానులతో చిట్ చాట్ చేసిన రాజ్ తరుణ్.. ప్రసుతం ప్రేమలో ఉన్నా. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు హింట్ ఇచ్చారు. అమ్మాయి వివరాలు మాత్రం తెలపలేదు. దీంతో.. రాజ్ తరుణ్ ప్రేమించింది హీరోయిన్ నే అనే ప్రచారం జరిగింది. తాజాగా, ఆ ప్రచారానికి తెరదించారు కుర్ర హీరో.
ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాజ్ తరుణ్ తను ప్రేమించిన అమ్మాయి వివరాలు కొన్ని తెలిపారు. విజయవాడకు చెందిన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. సాధారణ కుటుంబంలో పెరిగిన అమ్మాయి. ఆమెకు సినీ పరిశ్రమతో ఏ మాత్రం సంబంధం లేదని తెలిపారు. ఆరేళ్ల క్రిందట బర్త్ డే పార్టీలో ఆమెని కలిశా. అప్పటి నుంచి డేటింగ్ లో ఉన్నాం. ఇంకా పెళ్లి డేటు ఫిక్స్ కాలేదు. ఈ యేడాదియే పెళ్లి చేసుకోతున్నట్టుగా తెలిపారు రాజ్ తరుణ్.
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే రాజ్ తరుణ్ హీరో అయ్యారు. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సినిమా చూపిస్తా మామ, కుమారి 24ఎఫ్ సినిమాలతో విజయాలు అందుకొన్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగేలా కనిపించాడు. మాస్ మహారాజా రవితేజ స్థానాన్ని భర్తీ చేస్తాడనే కామెంట్స్ వినిపించాయ్. ఐతే, ప్రస్తుతం రాజ్ తరుణ్ ప్లాపుల్లో ఉన్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒక్కటే సినిమాలో నటిస్తున్నారు.